హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్‌కు డీలర్ల వినతి

AKP: రాష్ట్రవ్యాప్త రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రోలుగుంట తహశీల్దార్ నాగమ్మకు మండల డీలర్ల సంఘం ఇవాళ వినతిపత్రం అందజేసింది. క్వింటాల్‌కు రూ.200 కమీషన్ ఇవ్వాలని, షాపుల నిర్వహణ భత్యం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మండల డీలర్లు అందరూ పాల్గొన్నారు.