హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పార్కుల అభివృద్ధికి ప్రాధాన్యత: కమిషనర్

E.G: రాజమండ్రి నగర ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేలా పార్కులను సుందరీకరిస్తున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు. ఆర్.వి.నగర్ మహిళా పార్కులో రూ.75 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను మంగళవారం పరిశీలించారు. ప్రతి పార్కులో వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, వ్యాయామ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.