హైదరాబాద్: 28°C
క్రీడలు

మాజీ క్రికెటర్ కన్నుమూత

జింబాబ్వే మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ మహిళా అంపైర్ సారా దంబనేవాన (36) అనారోగ్యంతో కన్నుమూసింది. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం రాత్రి హరారే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. 2009-2014 మధ్య జింబాబ్వే జట్టుకు ప్రాతినిథ్యం వహించింది. అంపైర్‌గా మహిళల ప్రపంచకప్‌ వంటి పెద్ద టోర్నీలలో సేవలు అందించింది.