హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారి వాహనసేవలో జానపద కళల సందడి

TPT: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు ఇవాళ చిన్నశేష వాహనసేవలో జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏపీతో పాటు తొమ్మిది రాష్ట్రాలకు చెందిన 17 కళాబృందాల్లోని 489 మంది కళాకారులు తప్పెటగుళ్లు, థింసా, కురత్తి తదితర సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించి భక్తులను అలరించారు.