ASR: అరకులోయ గ్రామదేవత శ్రీశ్రీశ్రీ కనకదుర్గంబిక అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజు అమ్మవారు అన్నపూర్ణా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ఆందరూ ఆయురారోగ్యాలు కలగాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
అన్నపూర్ణా దేవిగా కనకదుర్గంబిక అమ్మవారు


