హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తాగునీటి కోసం కాలనీవాసులు ధర్నా

ప్రకాశం: కనిగిరి మండలంలోని ఎన్. గొల్లపల్లి గ్రామంలో దళిత కాలనీవాసులు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తాగేందుకు గుక్కెడు నీరు కూడా అందుబాటులో లేదని, పలుమార్లు అధికారులకు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి దళిత కాలనీకి తాగునీరు సరఫరా చేయాలని కోరారు.