AKP: నర్సీపట్నం మండలం రేషన్ డీలర్లు తమ సమస్యలపై మంగళవారం సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ అశోక్‌కు వినతిపత్రం అందజేశారు. రేషన్ కార్డు హోల్డర్స్‌ను ఆశాస్త్రీయంగా మ్యాపింగ్ చేశారని, క్యూఆర్ కోడ్ అమలు చేయవద్దని, కమిషన్ పెంచాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేషన్ డీలర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: సమస్యలపై రేషన్ డీలర్లు వినతి పత్రం


