అన్నమయ్య: ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ ధీరజ్ ఆదేశాలతో రామాపురం పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బీసీ కాలనీ, నల్లగుట్టపల్లె, చిట్లూరు హరిజనవాడలో ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. కార్డన్ అండ్ సెర్చ్‌లో ఇళ్లు, దుకాణాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 10 వాహనాలను సీజ్ చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మూడు ప్రాంతాల్లో ఫుట్ పెట్రోలింగ్


