హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హెచ్‌ఆర్‌సీ చీఫ్‌గా జస్టిస్ మూర్తి

GNTR: రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్‌గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఎంపికైనట్లు సమాచారం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎంపిక కమిటీ నిర్ణయించి దస్త్రాన్ని గవర్నర్‌కు పంపింది. 2016లో శాశ్వత న్యాయమూర్తి అయిన ఆయన 2022 జూన్‌లో విరమణ పొందారు. అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. కొంతకాలంగా ఖాళీగా ఉన్న ఈ పదవి భర్తీ కానుంది.