ప్రకాశం: దసరా ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు మంగళవారం కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీ దత్తపీఠంలో శ్రీ లలితా పరమేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందచేయడం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
'అన్నపూర్ణ దేవి' గా లలితా పరమేశ్వరి అమ్మవారు


