హైదరాబాద్: 28°C
క్రీడలు

జట్టు ప్రయోజనాలే ముఖ్యం: మాజీ సెలెక్టర్

మాజీ సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడం కోసమే సచిన్, గంభీర్, యువరాజ్, జహీర్ వంటి దిగ్గజాలను రిటైర్మెంట్ వైపు నడిపించాల్సి వచ్చిందని వెల్లడించాడు. ఆనాడు తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం వల్లే నేడు కోహ్లీ, రోహిత్ వంటి ప్రపంచ స్థాయి ఆటగాళ్లు తయారయ్యారని తెలిపాడు. ఎంతటి స్టార్ ఆటగాడైనా జట్టు ప్రయోజనాల కంటే ఎక్కువ కాదన్నాడు.