హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణం

GNTR: అమరావతిలో ప్రపంచస్థాయి బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం మొదలైంది. తవ్వకాలు పూర్తయి కాంక్రీట్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. తొలిదశలో రూ.650 కోట్లతో 500 పడకల ఆసుపత్రిని 2028 జూన్ కల్లా సిద్ధం చేయనున్నారు. సింగపూర్ ప్రమాణాలతో ఇక్కడ రోగులకు అత్యుత్తమ వైద్యం అందిస్తారు. భవిష్యత్తులో ఈ ఆసుపత్రి సామర్థ్యాన్ని 2,000 పడకలకు విస్తరించనున్నారు.