హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నపూర్ణాదేవి అలంకారంలో మంగళ గౌరీ

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1 గ్రామంలోని శ్రీ మంగళ గౌరీ సమేత అమరలింగేశ్వర స్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మంగళ గౌరీ అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించగా, భక్తులు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.