హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

ప్రకాశం: పొదిలి పట్టణంలోని ఓ ప్రైవేట్ లాడ్జిలో మంగళవారం సయ్యద్ కరిముల్లా (22) అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నిశ్చితార్థ వేడుక నిమిత్తం గత రెండు రోజులుగా లాడ్జిలో ఉంటున్న యువకుడు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై రాజేష్ విచారణ చేపట్టారు.