ATP: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కేవలం 25.18 శాతానికే పరిమితం చేసి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని మాజీ ఎంపీ తలారి రంగయ్య విమర్శించారు. అనంతపురం జిల్లా YCP కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలకు చేసిన మోసానికి సీఎం చంద్రబాబు నైతిక బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం వెంటనే రాజీనామా చేయాలి: తలారి రంగయ్య


