హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీతారామపురానికి రైతు బజార్ కల్పించాలి'

NLR: రైతు బజార్ లేకపోవడంతో పంట ఉత్పత్తుల విక్రయానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యవర్తుల కారణంగా ఆశించిన ధర లభించడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులకు న్యాయమైన ధర, వినియోగదారులకు తక్కువ ధరకే కూరగాయలు అందించేందుకు సీతారామపురంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారులు ఈ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.