హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యర్రబాలెంలో ఆత్మహత్యలకు నిలయంగా బావి

GNTR: తాడేపల్లి పరిధి యర్రబాలెం రైస్ మిల్లు రోడ్డులోని పాత బావి శిథిలావస్థకు చేరింది. రక్షణ వలయం లేకపోవడంతో ఇది ఆత్మహత్యలకు అడ్డాగా మారింది. ఇందులో దూకి ఒకరు మృతి చెందగా, ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. బావి నిండా చెత్తాచెదారం, పిచ్చిమొక్కలు పేరుకుపోయాయి. వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించి బావికి రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.