హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామయ్య సన్నిధిలో వైభవంగా రామాయణ మహాపారాయణం

BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో మంగళవారం రామాయణ మహాపారాయణం వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక అభిషేకం, అర్చనలు నిర్వహించిన అనంతరం రామాయణ మహాపారాయణాన్ని ప్రారంభించారు. రామ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగిపోయింది. ఈ పారాయణంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.