W.G: పెనుగొండ శ్రీ వాసవి శాంతిధామ్‌లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అఖిల భారత్ శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అమ్మవారిని విశేషంగా అలంకరించగా, భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు.
ఆంధ్రప్రదేశ్
పెనుగొండలో వైభవంగా నవరాత్రి వేడుకలు


