KDP: బ్రహ్మంగారిమఠం మేనేజర్ ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. గతంలో సస్పెన్షన్‌కు గురైన ఆయన హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. తాజా కేసు నేపథ్యంలో పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకుని మైదుకూరు డీఎస్పీ కార్యాలయంలో విచారించారు. అనంతరం నోటీసులు జారీ చేసి పంపించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే కేసు నమోదు చేశారని ప్రసాద్ ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
బ్రహ్మంగారిమఠం మేనేజర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు


