హైదరాబాద్: 28°C
క్రీడలు

వెయ్యి గోల్స్‌‌కు చేరువలో ఫుట్‌బాల్‌ దిగ్గజం

ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో 1,000 గోల్స్‌ మైలురాయికి మరింత చేరువయ్యాడు. నెఫ్ట్చీ ఫెర్గానాతో జరిగిన మ్యాచ్‌లో ఆయన కెరీర్‌లో 981వ గోల్‌ సాధించాడు. ఈ మ్యాచ్‌లో అల్‌ నస్ర్‌ 3-1తో విజయం అందుకుంది. దీంతో వెయ్యి గోల్స్‌ లక్ష్యాన్ని చేరుకోవడానికి రొనాల్డో మరో 19 గోల్స్‌ చేయాల్సి ఉంది.