హైదరాబాద్: 28°C
క్రీడలు

విజయం ముంగిట ఆస్ట్రేలియా

డర్బన్‌ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం ముంగిట నిలిచింది. 421 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు నాలుగో రోజు ఆట ముగిసేసరికి 102/4 పరుగులు చేశారు. చివరిరోజు మరో 6 వికెట్లు పడగొడితే ఆసీస్ విజయం సాధించనుంది. ప్రస్తుతం మార్క్రమ్ (45), ముల్దర్ (5) క్రీజులో ఉన్నారు. సఫారీలు ఓటమిని తప్పించుకోవాలంటే అద్భుతం జరగాల్సిందే.