హైదరాబాద్: 28°C
క్రీడలు

హైదరాబాద్‌కు చేరుకున్న టీమిండియా

హైదరాబాద్ ఉప్పల్ వేదికగా రేపు భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 జరగనుంది. ఈ మ్యాచ్ కోసం రెండు జట్ల ఆటగాళ్లు నగరానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన వీరు, అక్కడి నుంచి నేరుగా హోటల్‌కు వెళ్లారు. ఇవాళ ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్నారు. రేపటి మ్యాచ్‌ను పురస్కరించుకుని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.