హైదరాబాద్: 28°C
క్రీడలు

షమీ లాంటి బౌలర్ జట్టులో ఉండాలి: కైఫ్

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే భారత్‌కు బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలే కీలకమని మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ స్పష్టం చేశాడు. కేవలం బ్యాటింగ్ లేదా రోహిత్, కోహ్లీలపైనే భారం వేస్తే సరిపోదన్నాడు. విదేశీ పిచ్‌లపై ఒక్క ఆటగాడు మ్యాచ్ గెలిపించలేడని, మిగతావారి సహకారం కూడా అవసరమని పేర్కొన్నాడు. ఇలాంటి మెగా టోర్నీలలో షమీ లాంటి సీనియర్ బౌలర్ జట్టులో ఉండాలని అభిప్రాయపడ్డాడు.