హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గెడ్డలు దాటలేక గిరిజనుల అవస్థలు

PPM: గిరిశిఖర పంచాయతీ కుంతేసు నుంచి లాంజ గ్రామానికి 4 కి.మీ. రహదారి నిర్మాణ పనులు ఏడాదిగా నిలిచిపోయాయి.దీంతో గిరిజనులు మండల కేంద్రం కొమరాడకు చేరుకోవాలంటే 27కి.మీ. ప్రయాణించాల్సి వస్తోంది. లేదంటే మార్గంలోని ఐదు కొండ గెడ్డలను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఒడిశా మీదుగా వెళ్తే 60 కి.మీ. ప్రయాణించాల్సి వస్తోందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.