హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుల్లదబ్బ ధర పతనంతో రైతుల ఆందోళన

PPM: సీతంపేట ఏజెన్సీలో పుల్లదబ్బ ధరలు తగ్గడంతో గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం పండు రూ.5 పలకగా, ప్రస్తుతం రూ.2 నుంచి రూ.3కే విక్రయిస్తున్నారు. నారింజ పండ్ల ధర కూడా తగ్గింది. వ్యాపారులు సిండికేట్‌గా మారి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తూ, ఐటీడీఏ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.