హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారామెడికల్ అభ్యర్థులకు అలర్ట్.!

KRNL: జిల్లా మెడికల్ కాలేజీలో ఏడు రకాల పారామెడికల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు జరిగే కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ పత్రాలతో హాజరుకావాలని ప్రిన్సిపల్ చిట్ట నరసమ్మ తెలిపారు. వివరాలకు KNL, NDL జిల్లాల అధికారిక వెబ్‌సైట్లను సంప్రదించాలని సూచించారు.