హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొలెరో ఢీకొని విద్యుత్ స్తంభం ధ్వంసం

KRNL: దేవనకొండ మండలం దుప్పనగుర్తిలో బొలెరో వాహనం ఢీకొని 11 కేవీ విద్యుత్ స్తంభం నేలకూలింది. చాంద్ భాషా అనే రైతు పొలంలో టమాటాల రవాణాకు వెళ్లిన వాహనం డ్రైవర్ మద్యం మత్తులో రివర్స్ చేస్తూ స్తంభాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సరఫరా పునరుద్ధరణ కాకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు.