హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైలు ఢీకొని వ్యక్తి మృతి..!

NZB: రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జిల్లా రైల్వే ఎస్సై సాయి రెడ్డి మంగళవారం తెలిపారు. నవీపేట్-బాసర రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. మృతుడి వయసు 35- 40 సంవత్సరాల వరకు ఉండొచ్చన్నారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. ఎవరైనా గుర్తుపడితే NZB రైల్వే పోలీస్ స్టేషన్ సంప్రదించాలన్నారు.