కృష్ణా: ఇవాళ విజయవాడలో తమిళనాడు సీఎం విజయ్ పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటలకు గన్నవరం చేరుకుని ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకున్నాక, సాయంత్రం 6 గంటలకు సీఎం చంద్రబాబును కలవనున్నారు. ఈ భేటీలో గోదావరి-కావేరీ అనుసంధానం, కృష్ణా నీటి విడుదలపై చర్చిస్తారు. అనంతరం రాత్రి వేళ ఆయన విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం విజయ్ షెడ్యూల్ ఇదే!


