హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గల్లంతైన మృతదేహం లభ్యం

ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి వద్ద మడేరు వాగులో గల్లంతైన కేదారి దిలీప్ కుమార్ మృతదేహం ఇవాళ ఉదయం లభ్యమైంది. దిలీప్ నిన్న వాగులో దిగి కనిపించకుండా పోయారు. రాత్రి చీకటి పడిపోవడంతో గాలింపు ఆపారు. ఇవాళ ఉదయం తిరిగి గాలింపు చర్యలు మొదలుపెట్టగా అదే ప్రాంతంలో మృతదేహం లభించినట్లు ఎస్సై చిన్నబాబు తెలిపారు.