హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుమరాడ-వెంగాపురం రహదారిపై మురుగు కష్టాలు

PPM: బలిజిపేట మండలంలోని తుమరాడ నుంచి వెంగాపురం బస్ స్టాప్ కు వెళ్లే రహదారిపై మురుగునీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా కాలువలు లేకపోవడంతో వెంగాపురం కాలనీలోని ఇళ్ల నుంచి వచ్చే వాడుకనీరు రహదారిపైనే నిలిచిపోతుంది. ఏడాది పొడవునా ఇదే పరిస్థితి కొనసాగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.