హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డుంబ్రిగూడలో రోడ్లపైనే మూగజీవాలు

ASR: డుంబ్రిగూడ మండలంలోని జాతీయ రహదారిపై మూగజీవాలు రోడ్లపైనే పడుకుని ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారిపై అకస్మాత్తుగా అడ్డుగా వస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై మూగజీవులు సంచరించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.