NDL: శ్రీశైలం మండలం సున్నిపెంటలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వెంకట్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలా అండగా ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిన నేత


