హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవిపై ఉత్కంఠ

ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ ఛైర్మన్ పదవిని గతంలో రెండుసార్లు బీసీ వర్గానికి కేటాయించారు. ఈ సారి ఓసీకి కేటాయించడంతో రాజకీయ సందడి నెలకొంది. కూటమి నుంచి దప్పిలి కాశిరెడ్డి, దప్పిలి రంగారెడ్డి, పల్లె శ్రీనివాస్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి డాక్టర్ భూమా నరసింహారెడ్డి, రామచంద్రారెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి. అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.