హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పల్నాడు రైతుల అంతరాష్ట్ర యాత్ర ప్రారంభం

PLD: కలెక్టరేట్ వద్ద MIDH పథకం కింద కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఉద్యాన రైతుల అంతరాష్ట్ర అధ్యయన యాత్రను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఐఏఎస్ జెండా ఊపి ప్రారంభించారు. ఆధునిక సాగు పద్ధతులు, వినూత్న వ్యవసాయ సాంకేతికతలపై రైతులకు సమగ్ర అవగాహన కల్పించి, ఉత్పాదకతతో పాటు వారి నికర ఆదాయాన్ని రెట్టింపు చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆమె పేర్కొన్నారు.