ELR: జంగారెడ్డిగూడెం పట్టణంలోని గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడో రోజైన మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బంగారు పాత్ర, గరిటె ధరించి భక్తులను అనుగ్రహించారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆంధ్రప్రదేశ్
అన్నపూర్ణాదేవిగా గంగానమ్మ దర్శనం


