హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న శ్రీదేవి అమ్మవారు

కోనసీమ: అమలాపురం పట్టణంలోని శ్రీదేవి మార్కెట్లో ఉన్న శ్రీదేవి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా మూడవరోజు మంగళవారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సకల జీవులకు అన్నాన్ని ప్రసాదించే జగన్మాతగా అమ్మవారి పూజలు అందుకుంటున్నారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, అమ్మవారిని దర్శించుకుంటున్నారు.