హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిట్ అండ్ రన్.. వ్యక్తి మృతి

CTR: పూతలపట్టు మండలంలోని తలుపులపల్లి సమీపంలో ఇవాళ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. పూతలపట్టుకు చెందిన రఫీ పీలేరుకు వెళ్తుండగా తలుపులపల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రఫీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.