హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరు MLA పర్యటన ఇలా!

NTR: తిరువూరు నియోజకవర్గ శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు ఏ.కొండూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉదయం వల్లంపట్ల, కంభంపాడు-1, కృష్ణారావుపాలెం, ఏ.కొండూరు తండా గ్రామాలలో 15వ ఆర్థిక సంఘంనిధులతో నిర్మించనున్న విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం చీమలపాడు శ్రీరామ మందిరంలో దసరా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.