హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి పాపికొండల యాత్ర షురూ!

E.G: గోదావరి నదిలో పాపికొండల విహారయాత్రకు అధికారులు అనుమతులు ఇచ్చారు. వరదల కారణంగా 70 రోజులుగా నిలిచిపోయిన బోటు ప్రయాణాలు మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. నదిలో నీటిమట్టం తగ్గడంతో ఉన్నతాధికారులు పరిశీలించి, బోట్లకు అనుమతులు మంజూరు చేశారు. రాజమండ్రి నుంచి పర్యాటకులను బస్సుల్లో పోలవరం ప్రాజెక్టు మీదుగా బోట్ పాయింట్‌కు తీసుకెళ్తారు.