హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ప్రకాశం: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS)లో భాగంగా సోమవారం మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా ఐపీఎస్ ప్రజల నుంచి 60 ఫిర్యాదులను స్వీకరించారు. పెద్దారవీడు మండలానికి చెందిన రైతులు మొక్కజొన్న పంటకు సంబంధించిన డబ్బులు చెల్లించలేదని ఫిర్యాదు చేయగా, ఎస్పీ స్పందించి సమస్యపై సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించారు.