హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని ఆర్టీసీ డిపోలో డ్యూటీల వివాదం

KRNL: ఆదోని ఆర్టీసీ డిపోలో అదనపు డ్యూటీల కేటాయింపుపై వివాదం నెలకొంది. పట్టణానికి చెందిన హేమలత 16 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్నారు. వారానికి మూడు డ్యూటీలే ఇస్తుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కుమారుల చదువుల కోసం అదనపు ఆదాయం అవసరమని, మరిన్ని డ్యూటీలు కేటాయించాలని కోరారు.