హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలిగిరిలో 31 వాహనాలు స్వాధీనం

NLR: నెల్లూరు జిల్లా కలిగిరి మండలం గంగిరెడ్డిపాలెంలో పోలీసులు కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. సీఐ ఆధ్వర్యంలో 25 మంది సిబ్బంది 85 ఇళ్లను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేని 28బైకులు, 2ఆటోలు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ఆపరేషన్ త్రిశూల్‌పై ప్రజలకు అవగాహన కల్పించి, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.