హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివాలయంలో వాటర్ ప్లాంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

KDP: ప్రొద్దుటూరు శివాలయంలో భక్తుల సౌకర్యార్థం దాతల సహకారంతో రూ.4.50 లక్షలతో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, రూ.6 లక్షలతో షెడ్లు నిర్మించారు. వీటిని సోమవారం ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ప్రారంభించారు. భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ నారాయణరెడ్డి, ఈవో రమణ, కమిటీ సభ్యులు, దాతలు పాల్గొన్నారు.