KDP: వేముల మండలంలోని పెండ్లూరు చెరువులో చేపల వేట హక్కుల కోసం మంగళవారం బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మత్స్య అభివృద్ధి అధికారి తెలిపారు. వేలంలో పాల్గొనేవారు ఆధార్ కార్డుతోపాటు రూ.1,000 డిపాజిట్ చేయాలని సూచించారు. వేలంపాట ప్రారంభ ధరను రూ.22,825గా నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎంపీడీవో కార్యాలయంలో వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు పెండ్లూరు చెరువు చేపల వేలం


