హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మున్సిపల్ ఎన్నికలకు వైసీపీ సిద్ధం

W.G: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వైసీపీ అభ్యర్థులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని ఆ పార్టీ పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం తెలిపారు. సోమవారం తణుకులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ప్రజల ఖాతాల్లో పారదర్శకంగా జమ చేసిన సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్షగా నిలుస్తాయని పేర్కొన్నారు.