హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు వద్దు'

W.G: ధాన్యం కొనుగోలు సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ కేఆర్ కల్పశ్రీ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి రైతు సేవా కేంద్రంలో ఖరీఫ్ ధాన్యం సేకరణపై రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలు, నాణ్యతా ప్రమాణాలు, ధాన్యంలో తేమ శాతంపై అవగాహన కల్పించారు.