హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికల బరిలోకి దిగనున్న CPM

W.G: త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, పరిషత్తు, పంచాయతీ ఎన్నికల్లో సీపీఎం పోటీ చేయనుందని ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఏ. రవి ప్రకటించారు. పాలకొల్లు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణ నాయకుడు చల్లా సోమేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం వివరాలను మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జి పత్రికలకు విడుదల చేశారు.