హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లంచం కేసులో మాజీ ఏఈకి జైలు శిక్ష

ELR: బోరు విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరణకు లంచం తీసుకున్న కేసులో ఏపీఈపీడీసీఎల్ మాజీ ఏఈ భూక్యా బాలకృష్ణకు రాజమహేంద్రవరం ఏసీబీ కోర్టు ఏడాది సాధారణ జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించింది. చింతలపూడి మండలం కమలాపురానికి చెందిన రైతు నుంచి రూ.4 వేలు తీసుకుంటుండగా 2008 మే 3న ఏసీబీ అధికారులు ఆయనను పట్టుకున్నారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది.